Syra Narasimhareddy Review By Suman Arikilla

        *****SYRA NARASIMHA REDDY REVIWE*****

ఇన్ని రోజులగా ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22 న విడుదలైంది . మరి చిత్ర యూనిట్ అనుకున్న అంచనాలను , ఫాన్స్ పెట్టుకున్న అంచనాలను ఈ చిత్రం అందుకోగలిగిందా ఇప్పుడు చూద్దాం.



**కథ **
ఈ చిత్రం 1847 లో బ్రిటిష్ రాజు  యొక్క దుర్మార్గాలకు  వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రాయలసీమ కు చెందిన  స్వాతంత్ర సమరయోధుడు , మజ్జారి నరసింహ రెడ్డి జీవిత కథ  ఆధారంగా తెరకెక్కింది . ఈ ప్రాంతంలోని  స్వాతంత్ర సమరయోధుల్లో  నరసింహరెడ్డి  ఒకరు, అప్పటికి ఆ ప్రాంత ప్రజలు బ్రిటిష్  పాలనలో  ఉంటూ  అన్ని రకాల పన్నులు కట్టేవారు . రాయలసీమ కరువు తో సతమతవుతున్న సమయంలో కూడా భూమి పన్ను కట్టాలని  బ్రిటిష్ వారు ప్రజలను వేధిస్తుంటారు . ఆ పరిస్థితిని  ఎదిరించడానికి నరసింహ రెడ్డి మిగతా స్వాతంత్ర సమరయోధులను , ప్రజలను, ఎలా ఏకం చేస్తాడు ,బ్రిటిష్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటును  ఎలా కొనసాగించాడు అనేది మిగిలిన కథ.


**విశ్లేషణ **
దర్శకుడు సురేందర్ రెడ్డి, ఝాన్సీ లక్ష్మీ బాయి కథ తో  సినిమా ప్రారంభించారు. ఝాన్సీ లక్ష్మీ బాయి తన యోధులను ప్రేరేపించడానికి, 10 సంవత్సరాల క్రితం జరిగిన  ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథను వారికి వివరిస్తుంది.

ప్రారంభంలో బ్రిటీషర్ల దుష్కృతాలను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  కథనం లో బ్రిటీషర్ల పై ద్వేషం పెరగడానికి బాగా దోహదపడ్డాయి . ప్రారంభంలో కథనం కొంచం నెమ్మది అనిపించినా ఇంటర్వెల్ వరకు వచ్చే సరికి కథనం లో జోరు కనిపిస్తుంది.  బ్రిటిష్ ఆఫీసర్ జాక్సన్ పై మొదటిసారి నరసింహారెడ్డి తిరుగుబాటు చేసే సీన్ చాల బాగా వచ్చింది.
ఆ తరువాత వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ చాల బాగా  అనిపించింది .  ఇక్కడ డైరెక్టర్ సురేందర్ రెడ్డి    s s  రాజమౌళి ని అనుసరించినట్టు కనిపిస్తుంది

మెగాస్టార్ చిరంజీవి వయస్సు కొన్ని సన్నివేశాల్లో ఇబ్బంది పెట్టింది .  ఇందులో నరసింహ రెడ్డి (హీరో ) వయస్సు 30 సంవత్సరాలు  దీనికి చరణ్ ఐతే ఇంకా చాల బాగా నప్పేవాడు అనిపించింది.  అయినప్పటికీ చిరంజీవి గారు ఆ పాత్రకి తన అనుభవాన్ని రంగరించి చాల బాగా హావభావాలు పండించారు . ఇంకా డైలాగ్ డెలివరీ ఐతే చెప్పనవసరం లేదు. ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీ చేసారు. చిరంజీవి గారు.

వాస్తవానికి నరసింహారెడ్డి 4,5 తాలూకాలకు నాయకుడు కాదు వీరు గెరిల్లా యుద్దాలు చేసేవారు. ఇక్కడ అతని దేశభక్తిని కించపరచడం కాదు కానీ వాస్తవం అని చెప్పాం .

ఇంకో వాస్తవం నర్సింహారెడ్డి బ్రిటీషర్ల చే బందించబడటానికి ముందే అతని భార్య మరణించింది . కానీ మూవీ లో
నరసింహారెడ్డి బ్రిటిషర్లకు పట్టుబడినప్పుడు ఆమెను సజీవంగా చూపించారు.

ఎమోషనల్ క్లైమాక్స్ పనిచేసింది కానీ ఇది అనవసరమైన మాస్ హీరోయిజం తో కలసి ఉంటుంది.

**పెర్ఫార్మెన్సెస్ **
అందరు గొప్ప నటులు ఈ చిత్రం లో నటించారు . గోసాయి వెంకన్న క అమితాబ్ గారు చాల చక్కగా చేసారు. అవాకు రాజు గ సుదీప్ , జగపతి బాబు , నయనతార, తమన్నా, అందరు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. చిరంజీవి గారు నటన పరంగా చెప్పనవసరం లేదు వయస్సు విషయంలో తప్ప.

సాయిచంద్ , జగపతి బాబు పాత్రలు సెంటిమెంట్ ను చాల బాగా పండించాయి.

నిర్మాణ విలువలు చాల అద్భుతంగా ఉన్నాయి . నిర్మాత రామ్ చరణ్ చాల భారీగా ఖర్చు చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాల బాగుంది , విసువల్ ఎఫెక్ట్స్ అతికించినట్టుగా ఉన్నాయి.

**పోసిటివ్స్ **
మెగాస్టార్ ఇమేజ్ .
నిర్మాణవిలువలు .
స్టార్స్ .
నర్సింహారెడ్డి దేశభక్తి .
ఇంటర్వెల్ ముందు తరువాత వచ్చే సన్నివేశాలు .

**నెగెటివ్స్ **
నత్తనడక స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ లో .
చరిత్ర లో లేని సన్నివేశాలు ఉండడం .

సై రా చాలా కాలంగా మెగాస్టార్ ఎదురుచూస్తున్నా  డ్రీమ్ ప్రాజెక్ట్  ఎందుకన్నది సినిమా చూసిన తరువాత అర్థం చేసుకోవచ్చు. మంచి భావోద్వేగ విషయాలతో  కూడిన స్వాతంత్ర  సమరయోధుడి కథ ఇది .  నరసింహ రెడ్డి తిరుగుబాటు కథను సమర్థవంతంగా  కమర్షియల్ హిట్ చిత్రంగా తెరకెక్కించారు.  నిర్మాత రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి సహాయంతో తన  తండ్రి కోసం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ని అందించాడు.

Rating **3/5**

Comments

Popular Posts