Thupaki Ramudu Movie Review By Suman Arikilla




తుపాకీ రాముడు మూవీ రివ్యూ 

V6 ఛానల్ తీన్మార్ వార్తల ద్వారా ప్రపంచంలోని తెలుగు వారందరికీ పరిచయమైనా బిత్తిరి సత్తి  (అలియాస్ చేవెళ్ల రవి ) ని హీరో గ పరిచయం చేస్తూ రసమయి బాలకిషన్ (m.l.a ) నిర్మించిన చిత్రం "తుపాకీ రాముడు ". సింధు తులాని హీరోయిన్ గ బతుకమ్మ చిత్రం తీసిన ట్.ప్రభాకర్ దర్శకుడు. పక్క తెలంగాణ వాతావరణం లో సున్నితమైన ప్రేమకథ కలసిన కథ ఈ తుపాకీ రాముడు .


**కథ**

అనాథ అయినా రాముడు (బిత్తిరి సత్తి ) . ఎదుటి వారి కష్టాల్ని తన కష్టాలుగా భావించి సాయం చేసే మంచి గుణం కలిగినవాడు. పొట్ట కూటి కోసం తుపాకీ రాముడు వేషం వేసి గొప్పలు చెప్తూ అందరిని నవ్విస్తూ యాచించే వృత్తి అతనిది. ప్రస్తుత కాల సామజిక మాధ్యమాల వాళ్ళ తన వృత్తి కి ఆదరణ కరువై ఏదైనా పని చేసుకుని బ్రతకాలని అనుకుంటాడు.  ఇదే సమయం లో రాముడు ఊరి ని ఒక ఆపద నుండి కాపాడతాడు . వూరు వారందరు కలసి రాముడిది పెళ్లి చేయాలను కుంటారు కానీ రాముడికి చదువు లేకపోవడం వళ్ళ ఏ అమ్మాయి పెళ్లి చేసుకోడానికి ఒప్పుకోదు.  అనిత (ప్రియ ) రాముడికి చదువు నేర్పిస్తుంది . ఈ క్రమం లో అనిత ని రాముడు ప్రేమిస్తాడు . మరి రాముడు అనిత ప్రేమని పొందగలిగాడా ఇంకా అనిత వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ఏంటి అతను వీరి ప్రేమకు ఎలా అడ్డుపడ్డాడు అతని అడ్డు తొలగించుకుని రాముడు అనిత ప్రేమని ఎలా పొందగలిగాడు అన్నది మిగతా కథ.





**విశ్లేషణ**
తుపాకీ రాముడి పాత్రలో సత్తి చాల బాగా నటించాడు . కామెడీ యే కాదు సెంటిమెంట్ , యాక్షన్ సన్నివేశాలలో కూడా సత్తి చాల బాగా చేసాడు . హీరోయిన్ ప్రియా కూడా మొదటి చిత్రం లోనే పరిణితి చెందిన నటన ప్రదర్శించింది . r.s నంద కామెడీ కూడా ఈ చిత్రానికి అదనపు బలం అని చెప్పొచ్చు .  ఇంటర్వెల్ సీన్ చాల బాగా వచ్చింది . రాముడు చదువు నేర్చుకునేప్పుడు పడే పాట్లు , పెళ్లి చూపులకు వెళ్లే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే ఒకే ఫైట్ సీన్ కూడా చాల బాగా వచ్చింది . ఈ చిత్రం లో ఇచ్చిన కులాలపై సందేశం కూడా చాల బాగుంది. స్టోరీ పాతదే అయినా కామెడీ మరియు తెలంగాణ సంస్కృతి , సంభాషణలు సినిమాని నిలబెట్టాయి . ఫామిలీ తో కలసి 2 గంటలు చక్క ఎంజాయ్ చేసే సినిమా తుపాకీ రాముడు . (3 పాటలు ) స్వాతి ముత్యపు జల్లై , రేణుకేల్లమ్మ , నాచిన్ని రామయ్య చాల బాగున్నాయి.

**పాసిటివ్స్** 

బిత్తిరి సత్తి  పెరఫార్మెన్సు

3 పాటలు

కామెడీ

తెలంగాణ పల్లె వాతావరణం

తెలంగాణ dialougs

**నెగెటివ్స్**

చిత్రం నిడివి తక్కువ వుంది.

ఇచ్చిన సందేశం ఇంకొంచెం లోతుగా (డెప్త్)  గా ఉంటె బాగుండేది.

హీరోయిన్ పాత్ర ఇంకా ఎలివేట్ చెయ్యొచ్చు

Rating ***3/5***

Comments

Popular Posts